News September 4, 2024

అధికారులతో సమావేశమైన ఒంగోలు MLA

image

ఒంగోలు నగరంలోని TDP కార్యాలయంలో ఒంగోలు MLA దామచర్ల జనార్దన్ రావు నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డీఎంహెచ్వోల వంటి పలుశాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజలకు అవసరమైన అత్యవసర సదుపాయాలను కల్పించాలని తెలిపారు. నగరంలో పారిశుధ్య పనులు, డ్రైనేజ్ సమస్యలు లేకుండా చూడాలన్నారు.

Similar News

News September 10, 2024

అద్దంకి : ఇద్దరు మంత్రుల చొరవ.. రాత్రికి రాత్రే రక్ష

image

భారీ వర్షాలు, వరదలకు బాపట్ల జిల్లాలోని పెదపులివర్రు, పెనుమూడి, రుద్రవరం, రావిఅనంతారం గ్రామాల్లో కుడికరకట్ట చాలాచోట్ల బలహీనపడింది. దీంతో మంత్రులు అనగాని, గొట్టిపాటి అధికారులతో చర్చించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికుల సాయంతో 100కి పైగా ట్రాక్టర్ల మట్టిని 15వేలకుపైగా బస్తాల్లో నింపి రాత్రికి రాత్రి కరకట్టపై రక్షణ కవచంలా ఏర్పాటు చేశారు.

News September 10, 2024

ముండ్లమూరు: బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

image

ముండ్లమూరు మండలం మారెళ్ళకు చెందిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసి గర్భివతిని చేసిన కేసులో నిందితుడు శ్రీరామ్ జాన్ హైడ్ (చెర్రీ)ని అరెస్ట్ చేసినట్లు దర్శి DSP లక్ష్మీనారాయణ తెలిపారు. గత నెల 20న బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై నాగరాజు కేసు నమోదుచేశారు. అప్పటినుంచి నిందితుడు తప్పించుకొని తిరుగుతుండగా సోమవారం అరెస్ట్ చేసినట్లు వివరించారు.

News September 10, 2024

ప్రకాశం: నేడు సంక్షేమ సహాయకులకు కౌన్సెలింగ్

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సంక్షేమ సహాయకులకు నేడు బదిలీల కౌన్సెలింగ్ జరగనుంది. ఒంగోలులోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్ తెలిపారు. మొత్తం 312 మంది ఉద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.