News March 15, 2025

అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే

image

పరకాల నియోజకవర్గ యువత, మహిళలు స్వయం ఉపాధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా అధికారులు తోడ్పడాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పరకాల నియోజకవర్గం పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్,ట్రైనింగ్ సెంటర్, డెయిరీల ఏర్పాటు పై జిల్లా కలెక్టర్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Similar News

News March 16, 2025

మధ్యాహ్నం వీటిని తింటున్నారా?

image

మధ్యాహ్న భోజనంలో కచ్చితంగా సలాడ్లు ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అలాగే తెల్ల అన్నంకు బదులు క్వినోవా, బ్రౌన్ రైస్ లాంటి తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. బాగా వేయించిన కర్రీలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే బంగాళాదుంప, ప్రాసెస్డ్ ఫుడ్, మసాలా పదార్థాల జోలికి వెళ్లొద్దు.

News March 16, 2025

ధర్పల్లి: హోన్నాజీపేట్‌లో బీర్ సీసాతో కొట్టి చంపారు..!

image

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ గ్రామంలో పాలెం నడిపి మల్లయ్య (55) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని భార్య, కొడుకు కలిసి శనివారం రాత్రి చంపేశారని అనుమానిస్తున్నారు. మల్లయ్య తలపై కొడుకు మధు బీరు సీసాతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేయగా అందుకు మల్లయ్య భార్య లక్ష్మి సహకరించినట్లు తెలిసింది. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 16, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

image

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ బి.గీతేను ఆదివారం  కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు కో కన్వీనర్ కనిమేని చక్రధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి రాజేశ్వర్ రావు, పొన్నం లక్ష్మణ్ గౌడ్, తిరుపతి యాదవ్, తిరుపతి ఉన్నారు.

error: Content is protected !!