News December 18, 2024
అధికారులను అప్రమత్తం చేశాం: జేసీ
ఉండి మండలం ఎండగండి గ్రామ రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం ముఖాముఖి నిర్వహించారు. ధాన్యం రవాణాలో సమస్యలు ఏమైనా ఉన్నాయా, గోనె సంచులు రైతు సేవాకేంద్రంలో అందిస్తున్నారా, అనే అంశాలపై రైతుల నుంచి ఆరా తీశారు. జిల్లాలో 80 శాతం వరి కోతలు ముగిశాయని, అటు వర్షాల హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తామన్నారు.
Similar News
News January 25, 2025
నూజివీడు: లారీ డ్రైవర్‌కు జైలు శిక్ష
ఓ లారీ డ్రైవర్‌కు మూడు నెలల జైలు శిక్ష, రూ. 200 జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ శుక్రవారం తీర్పు వెలువరించారు. 2020లో బాపులపాడుకు చెందిన లెనిన్ ఆయన కుమార్తె శ్రీదేవీ బైకుపై వెళుతుండగా వారిని లారీ ఢీ కొట్టింది. దీంతో వారు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీనిపై అప్పట్లో హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో లారీ డ్రైవర్ ప్రభాకర్‌కు శిక్ష పడింది.
News January 25, 2025
పశువధను నిలిపివేయాలని కలెక్టర్‌కి మహిళలు విజ్ఞప్తి
తణుకు మండలం తేతలిలో లేహం ఫుడ్స్ పేరుతో నిర్వహిస్తున్న పశువధ కర్మాగారాన్ని మూసివేయాలని కోరుతూ స్థానిక మహిళలు జిల్లా కలెక్టర్ నాగరాణికు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాత్రి తణుకులోని రామకృష్ణ సేవా సమితి భవనంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్ నాగరాణిను కలిసిన వారు తణుకులో పశు వధ కర్మగారం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.
News January 25, 2025
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్..
ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తణుకు పట్టణంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి , జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలతో కలిసి తేతలి, మండపాక లేఔట్లను, ఎస్ ఎన్ వి ఎం పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని హెలి ప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అన్నారు.