News December 9, 2024

అధికారులను అలర్ట్ చేశాం: కలెక్టర్

image

ఏలూరు జిల్లా రైతులు తమ సమస్యలను నెం.18004256453, 08812-230448, 7702003584 ఫోన్ చేసి తెలపాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. సోమవారం కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న 48 గంటల్లో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులను అలర్ట్ చేశామన్నారు. రైతుల సమస్యలను దగ్గరలోని అధికారులకు తెలపాలన్నారు.

Similar News

News December 27, 2024

ఉండి: పార్శిల్లో డెడ్‌బాడీ.. నిందితురాలిగా పదేళ్ల చిన్నారి.!

image

ఉండి (M) యండిగండిలో తులసి ఇంటికి వచ్చిన పార్శిల్లో డెడ్‌బాడీ అయిన కేసులో పదేళ్ల చిన్నారి పాత్ర కూడా ఉందన్న విషయం సంచలనం రేపుతోంది. తులసి ఆస్తి కొట్టేయాలన్న కుట్రలో శ్రీధర్ వర్మ, అతని ఇద్దరి భార్యల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్యలో మూడో భార్య కుమార్తె హస్తం కూడా ఉందంటూ పోలీసులు ఆ చిన్నారిని నిందితురాలి జాబితాలో చేర్చారు. దీనిపై నేడు SP ఆద్నాం నయీం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారు.

News December 27, 2024

ద్వారకతిరుమల: టాయ్ నోట్ల‌తో వ్యాపారిని మోసం చేసిన యువకులు

image

ద్వారకాతిరుమలలో నకిలీ కరెన్సీ వ్యవహరంలో వ్యాపారిని మోసం చేసిన ఘటన గురువారం జరిగింది. జంగారెడ్డిగూడెంకు చెందిన ఇద్దరు యువకులు సుభాష్ అనే వ్యాపారిని నగదు 2.50 లక్షలు ఇస్తే నకిలీ కరెన్సీ రూ.15 లక్షలు ఇస్తామంటూ నమ్మించారు. అసలు నోట్లను సుభాష్ ఇచ్చి యువకుల నుంచి బ్యాగ్‌ను తీసుకున్నారు. టాయ్ కరెన్సీ ఉండటంతో కంగుతున్న సుభాష్ తన బ్యాగ్‌ను లాక్కున్నాడు. ఒకరిని పోలీసులకు అప్పగించగా మరో యువకుడు పరారయ్యాడు.

News December 27, 2024

ఏలూరు జిల్లాలో రూ. 92.02 కోట్లు మంజూరు: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో 983 సీసీ రోడ్డు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రూ.92.02 కోట్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ గురువారం మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామాల్లో రహదారుల సమస్య లేకుండా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం రోడ్డు నిర్మాణాలు చేపట్టిందని, సంక్రాంతికి మంజూరు చేసిన సీసీ రోడ్డులు పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.