News November 14, 2024
అధికారులపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఆగ్రహం

ఉపాధి హామీ, జల్జీవన్ మిషన్ కింద జిల్లాలో చేపట్టిన పనులకు నిధుల కొరత లేకున్నా పనులు గ్రౌండింగ్లో ఉండటంతో కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సంబంధిత శాఖాధికారులతో సమావేశమై పలు పనుల పురోగతిని సమీక్షించారు. పూర్తి స్థాయిలో పనులు పూర్తయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 18, 2025
కృష్ణా జిల్లాలో వర్షం.. దీపావళి వ్యాపారులకు ఆటంకం

దీపావళి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టపాసులు, గుండు సామాగ్రి దుకాణాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న వర్షం వ్యాపారులకు ఆటంకంగా మారింది. పండుగ సీజన్లో అధిక ఆదాయం ఆశించిన వ్యాపారులకు ఒకవైపు వర్షం, మరోవైపు అధికారుల అనుమతులు, భద్రతా నిబంధనల పరిమితులు కూడా పెద్ద సవాలుగా మారాయి.
News October 18, 2025
కృష్ణా: విశ్వనాథ సత్యనారాయణ వర్థంతి నేడే

తెలుగు సాహిత్యాన్ని ప్రపంచస్థాయికి చేర్చిన కవి సామ్రాట్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ వర్థంతి నేడు. 1895 సెప్టెంబర్ 10న ఉమ్మడి కృష్ణా (D) నందమూరులో జన్మించిన విశ్వనాథ తన అద్భుతమైన రచనలతో తెలుగు సాహిత్యంలో అజరామరుడయ్యారు. 1976 అక్టోబర్ 18న ఆయన తుదిశ్వాస విడిచినా, ఆయన సృష్టించిన ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’, ‘వేయిపడగలు’ వంటి సాహిత్య సృష్టులు తెలుగుజాతి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి.
News October 18, 2025
మచిలీపట్నం: పిచ్చి మొక్కలు తొలగించిన కలెక్టర్

స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం రైతు బజారు పక్కన ఉన్న పశువుల ఆస్పత్రిలో జరిగిన శ్రమదానం కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. ఉద్యోగులతో కలిసి పశువుల ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖరరావు, తదితరులు పాల్గొన్నారు.