News June 7, 2024
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీతక్క

వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వరదల వల్ల ప్రాన నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. గత ఏడాది వరదల కారణంగా ముంపుకు గురైన గ్రామాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని, వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.
Similar News
News November 4, 2025
వరంగల్: భారీగా పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో సోమవారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం 341 రకం మిర్చి క్వింటాకు రూ.16,200 ధర పలకగా.. ఈరోజు రూ.17,800 అయింది. అలాగే, వండర్ హాట్ (WH) మిర్చికి రూ.15,500 ధర వస్తే.. నేడు రూ.16,200 అయింది. మరోవైపు, తేజ మిర్చి ధర నిన్న రూ.14,000 ధర ఉంటే.. మంగళవారం 15,100 అయింది.
News November 3, 2025
వైద్య సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్‌ఓ

వైద్య ఆరోగ్య సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు ఆదేశించారు. శుక్రవారం ఆయన రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వైద్యులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రజలకు అందించాల్సిన వైద్య సేవలపై దిశా నిర్దేశం చేశారు. వైద్య సిబ్బంది గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించాలని, అలాగే మందుల నిల్వలపై ఆరా తీయాలని ఆయన సూచించారు.
News November 3, 2025
చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా ఉండాలి: మంత్రి వాకిటి

చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రూ. 122 కోట్ల వ్యయంతో 83 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను 26 వేల నీటి వనరుల్లో నవంబర్ 20లోపు విడుదల చేయాలని ఆయన తెలిపారు. వరంగల్ జిల్లాలో ఈ నెల 6 నుంచి చేప పిల్లల పంపిణీ ప్రారంభమవుతుందని కలెక్టర్ సత్య శారద తెలియజేశారు.


