News August 31, 2024

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి గొట్టిపాటి

image

రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా విద్యుత్​ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో శనివారం ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలని సూచించారు. అలాగే ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా చూడాలని ఆదేశించారు.

Similar News

News December 1, 2025

ప్రకాశం: DSPని ఆశ్రయించిన ప్రేమ జంట

image

జలదంకి(M) లింగరాజు అగ్రహారానికి చెందిన అన్నం కార్తిక్, ప్రకాశం జిల్లా కొత్తపట్నం(M) మున్నూరుకు చెందిన సూరగం ప్రసన్న ప్రేమించుకున్నారు. వీరు ఇద్దరు మేజర్‌లు కావటంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా కావలి పీజీ సెంటర్ వద్ద ఉన్న శ్రీమాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో కావలి డీఎస్పీని ఆదివారం కలిసి రక్షణ కల్పించాలని కోరారు.

News December 1, 2025

అధ్యక్షా.. రైల్వే పెండింగ్ పనులు పూర్తి చేయండి!

image

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొననున్నారు. జిల్లాకు చెందిన నడికుడి – కాళహస్తి రైల్వే లైన్, ఎప్పటి నుండో వేచి ఉన్న గిద్దలూరు రైల్వే గేటు బ్రిడ్జి, ఇతర రైల్వే అభివృద్ధి పనులు, పొగాకు రైతుల సమస్యలపై, అల్లూరు వద్ద ఏర్పాటు చేయబోయే ఎయిర్ పోర్ట్, పలు అభివృద్ధి అంశాలపై ఎంపీ గళమెత్తాలని ప్రజలు కోరుతున్నారు. మరి MP ఏం ప్రస్తావిస్తారో చూడాల్సి ఉంది.

News December 1, 2025

BREAKING ప్రకాశం: క్రిస్మస్ ఏర్పాట్లు..ఇద్దరు మృతి.!

image

త్రిపురాంతకంలో సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కొత్త అన్నసముద్రంలో విద్యుత్ ఘాతానికి గురై ఎస్సీ కాలనీకి చెందిన ఇరువురు మృతి చెందారు. పచ్చిలగొర్ల విజయ్ (40) వీర్నపాటి దేవయ్య (35) సెమీ క్రిస్మస్ వేడుకలలో భాగంగా స్టార్ ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.