News August 31, 2024
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనగాని
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసరం అయితే తప్పించి ఎవరూ బయటకు రావొద్దన్నారు. జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో రోడ్డు, రవాణా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ, యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Similar News
News September 12, 2024
ఏచూరి సీతారాం మృతి పట్ల మంత్రి లోకేశ్ సంతాపం
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ గురువారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏచూరి మృతి తీవ్ర విషాదం నింపిందన్నారు. ‘ప్రజాపోరాట యోధుడిని కోల్పోయాం. ప్రజా ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేసిన ఆయనకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నా.. అమర్ రహే కామ్రేడ్ సీతారాం ఏచూరి’ అంటూ ఆయన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
News September 12, 2024
గుంటూరు: డిగ్రీ సప్లిమెంటరీ మూల్యాంకనం ప్రారంభం
ANU ఐదో సెమిస్టర్ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం గుంటూరు మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈనెల 13న ప్రారంభవుతుందని ప్రిన్సిపల్ పి.ఎం.ప్రసాద్ తెలిపారు. వీటితో పాటు 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా జరుగుతుందన్నారు. మూల్యాంకన విధుల్లో పాల్గొనే అధ్యాపకులను విధుల నుంచి రిలీవ్ చేసి పంపాలని ఏఎన్యూ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ ను కోరారు.
News September 12, 2024
గుంటూరు: యానిమేటర్స్ ధర్నా కేసును కొట్టేసిన కోర్టు
సమస్యలు పరిష్కరించి, వేతనాలు పెంచాలని యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం 2018లో గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగరంపాలెం పోలీసులు అప్పట్లో వారిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం యూనియన్ నాయకులపై మోపిన అభియోగాలు రుజువు చేయలేకపోవడంతో స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు (మొబైల్ కోర్టు జడ్జ్) కేసును ఇవాళ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.