News January 24, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జాన్ పహడ్ దర్గాలో గంధం ఊరేగింపుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టరేట్ తేజస్ నంద లాల్ పవార్ సూచించారు. గురువారం వేబేక్స్ ద్వారా సంబంధిత అధికారులతో వీసీ నిర్వహించారు. 24,25 తేదీల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నందున ఆధికారులు ఆప్రమత్తంగా ఉండాలని, అన్ని సౌకర్యాలు కల్పించాలని భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
Similar News
News October 28, 2025
అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ మన అందరి బాధ్యత: కలెక్టర్

అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా టోల్ ఫ్రీ నంబర్ 1064 గోడపత్రికను కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ జి.రాజకుమారి, జేసీ కొల్లాబత్తుల కార్తీక్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు ఎక్కడైనా అవినీతి ఘటనలు గమనించినప్పుడు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, సమర్థత పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
News October 28, 2025
కర్నూలు: గృహ నిర్మాణంపై చర్చించిన హౌసింగ్ డైరెక్టర్

కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన ఆరేకల్ రామకృష్ణ మంగళవారం హౌసింగ్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇద్దరూ జిల్లా గృహ నిర్మాణ ప్రగతిపై, అలాగే 2014–2019 మధ్య పెండింగ్లో ఉన్న హౌసింగ్ బిల్లుల పరిష్కారం వంటి అంశాలపై విశదంగా చర్చించారు.
News October 28, 2025
జూబ్లీ బైపోల్: మంత్రులకు బాధ్యతలు

జూబ్లీహిల్స్ బైపోల్లో భాగంగా డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
రహమత్నగర్- కోమటిరెడ్డి, పొంగులేటి, బోరబండ- సీతక్క, మల్లు రవి, వెంగళ్రావునగర్- తుమ్మల, వాకిటి శ్రీహరి, సోమాజిగూడ- శ్రీధర్ బాబు, అడ్లూరి, షేక్పేట్- కొండా సురేఖ, వివేక్, ఎర్రగడ్డ- దామోదర, జూపల్లి, యూసుఫ్గూడ- ఉత్తమ్, పొన్నం ప్రభాకర్కు కేటాయించారు.


