News August 18, 2024
అధికారులు తప్పు చేస్తే కఠిన చర్యలు: MLA రవికుమార్

తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలకు వెనకాడబోమని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ హెచ్చరించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆదివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు శాఖల వారీగా చర్చ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు సక్రమంగా అందించలేదని, అధికారులు వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ఛార్జి ఎంపీడీవో వరప్రసాద్, ఎంపీపీ రమాదేవి పాల్గొన్నారు.
Similar News
News October 20, 2025
శ్రీకాకుళంలో నేడు గ్రీవెన్స్ డేలు రద్దు

దీపావళి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఈక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ(సోమవారం) జరగాల్సిన గ్రీవెన్స్ డేను రద్దు చేశామని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు కలెక్టరేట్ గ్రీవెన్స్ డే సైతం రద్దు చేశామని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు వెల్లడించారు. వచ్చే సోమవారం యథావిధిగా గ్రీవెన్స్ డే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
News October 20, 2025
నేడు పీజీఆర్ఎస్ రద్దు: ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి

నేడు దీపావళి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక రద్దు అయింది. ఈ విషయాన్ని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఒక్క రోజు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నామని, ప్రజలు గమనించాలని కోరారు.
News October 20, 2025
శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్న డీఆర్ఓ

దక్షిణ కాశీగా పేరు ఉన్న జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో కొలువైన శ్రీముఖలింగేశ్వర స్వామిని శ్రీకాకుళం డీఆర్ఓ (జిల్లా రెవెన్యూ అధికారి) వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేద ఆశీర్వచనం ఆ కుటుంబానికి అందించారు. ఆలయ అనువంశిక అర్చకుడు రాజశేఖర్ మధుకేశ్వరుని తీర్థప్రసాదములను, చిత్రపటాన్ని వారికి ఇచ్చారు.