News August 18, 2024
అధికారులు తప్పు చేస్తే కఠిన చర్యలు: MLA రవికుమార్
తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలకు వెనకాడబోమని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ హెచ్చరించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆదివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు శాఖల వారీగా చర్చ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు సక్రమంగా అందించలేదని, అధికారులు వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌ఛార్జి ఎంపీడీవో వరప్రసాద్, ఎంపీపీ రమాదేవి పాల్గొన్నారు.
Similar News
News September 8, 2024
శ్రీకాకుళం: తుఫాన్ ఎఫెక్ట్.. 200 అడుగులు ముందుకు సముద్రం
శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం కనిపిస్తుంది. తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా జిల్లాలో అధికారులు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేశారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో సముద్రం సుమారు 200 అడుగులు ముందుకు రావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక జిల్లాలోని భావనపాడు, కళింగపట్నం తీర ప్రాంతాల్లో కూడా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
News September 8, 2024
SKLM: రేపు మీకోసం వినతుల స్వీకరణ కార్యక్రమం రద్దు
రేపు అనగా సెప్టెంబర్ 09, సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ (మీకోసం) వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించుట లేదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ప్రతి సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ(మీకోసం) వినతుల స్వీకరణ కార్యక్రమం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల తీవ్రత కారణంగా వినతుల స్వీకరణ కార్యక్రమం రద్దు చేశామన్నారు.
News September 8, 2024
అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు సెలవు లేదు: జిల్లా కలెక్టర్
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అంగనవాడి కేంద్రాలకు కూడా రేపు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు మాత్రమే రేపు సెలవని, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు సెలవు లేదన్నారు. అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు అందుబాటులో ఉండాలన్నారు.