News July 22, 2024

అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి: కలెక్టర్

image

అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్
సి.నారాయణరెడ్డి అన్నారు.
విధులలో సమయపాలన పాటించాలని, పనిలో నాణ్యత ఉండాలని అన్నారు. రెగ్యులర్ పనులతో పాటు, ప్రభుత్వ ప్రాధామ్య పథకాల అమలులో జాప్యం చేయవద్దని అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. 

Similar News

News October 1, 2024

నల్లగొండ: బతుకమ్మ, దసరా సందర్భంగా 639 అదనపు బస్సులు

image

బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని నల్లగొండ రీజియన్ లోని 7 డిపోల నుండి సుమారు 639 బస్సులను అదనంగా నడుపుతున్నామని ఆర్ఎం M. రాజశేఖర్ సోమవారం తెలిపారు. అక్టోబర్ 1 నుండి 11 వరకు, తిరుగు ప్రయాణం కోసం 13 నుండి 17 వరకు బస్సులు నడుపుతామని తెలిపారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా సురక్షితమైన, సౌకర్యవంతమైన, శుభప్రదమైన ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని కోరారు.

News October 1, 2024

NLG: లా పరీక్షలు వాయిదా

image

న్యాయశాస్త్రం 3, 5 సంవత్సరాల కోర్సు రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను వాయి దా వేస్తున్నట్లు నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరీక్షల కన్వీనర్ ఉపేందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. .

News October 1, 2024

ఆ బాధ్యత అధికారులపై ఉంది : కలెక్టర్

image

గ్రామాలలో ప్రజలకు రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రభుత్వ సంస్థల నిర్వహణపై చేయాల్సిన బాధ్యత జిల్లా స్థాయి మొదలుకొని, గ్రామ స్థాయి అధికారుల వరకు ఉందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.