News August 23, 2024
అధికారులు మీకు లంచం డిమాండ్ చేస్తే ఇలా చేయండి.!
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ప్రభుత్వ అధికారులు ఏమైనా పని కోసం లంచం అడిగితే వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. డీఎస్పీ నెంబర్: 9154388981, అటు ఏసీబీ ఇన్స్పెక్టర్ ల నెంబర్లు: 9154388984, 9154388986, 915488987, టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి పిర్యాదు చేయాలన్నారు. పిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు.
Similar News
News September 17, 2024
కొత్తగూడెం: అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన మంత్రి తుమ్మల
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పార్టీ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News September 17, 2024
మధిర: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన దాల్ గోపి (30) గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన గోపి ఇంటి వెనుక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలిస్తున్నారు.
News September 17, 2024
కమనీయం భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో మంగళవారం స్వామివారికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.