News January 5, 2025
అధికారులు సమన్వయంతో పని చేయాలి: టీటీడీ ఛైర్మన్
తిరుమల ఔటర్ రింగ్ రోడ్డు, కృష్ణతేజ రెస్ట్ హౌస్‌లోని క్యూ లైన్లు, పార్కింగ్ ప్రాంతాలను టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు శనివారం పరిశీలించారు. అనంతరం అన్నమయ్య భవన్‌లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైకుంఠ ద్వార దర్శనం కల్పించే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు.
Similar News
News January 9, 2025
రేపు తిరుపతికి చంద్రబాబు రాక
తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం గురువారం తిరుపతికి రానున్నారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ఆయన పరామర్శిస్తారని సమాచారం.
News January 8, 2025
పెద్దిరెడ్డికి ఆయుధాలు ఇచ్చేయండి: హైకోర్టు
ఎన్నికల ముందు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి నుంచి పోలీసులు లైసెన్స్‌డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తిరిగి ఇవ్వకపోవడంతో పెద్దిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నిన్న విచారణ జరిగింది. 2 వారాల్లోనే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు ఆయుధాలు అప్పగించాలని జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఆదేశించారు.
News January 7, 2025
ఢిల్లీలో శాంతిపురం యువకుడి దారుణ హత్య
ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ యువకుడి నిండు ప్రాణం తీసింది. చిత్తూరు జిల్లా శాంతిపురం(M) వెంకటేల్లికి చెందిన హరి కుమారుడు సునీల్ దిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో సునీల్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.4 లక్షలు అప్పులు చేశాడు. 3 రోజుల కిందట కుటుంబసభ్యులు అతడికి రూ.2 లక్షలు పంపించారు. మిగిలిన రూ.2లక్షలు ఇవ్వలేదని యువకుడిని సోమవారం బెట్టింగ్ గ్యాంగ్ హత్య చేశారని మంగళవారం కుటుంబసభ్యులు ఆరోపించారు.