News January 26, 2025

అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి సాధించాలి: మంత్రి

image

అవుకు మండలంలోని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మండలంలో అన్ని విధాల అభివృద్ధి సాధించడానికి కృషి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం అవుకు మండలం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మంత్రి బీసీ పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇరిగేషన్ ఈఈ సురేశ్ బాబు, ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

Similar News

News February 16, 2025

సీఎం రేవంత్‌కు సబ్జెక్ట్ లేదు: ఎంపీ అర్వింద్

image

TS: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎంపీ అర్వింద్ విమర్శించారు. ప్రపంచ దేశాలు మోదీని గౌరవిస్తుంటే, ఆయన కులంపై సీఎం విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్‌కు సబ్జెక్ట్ లేదని, అడ్మినిస్ట్రేషన్‌లోనూ ఆయన విఫలమయ్యారన్నారు. కులగణనలో కోటి మంది ప్రజల లెక్క తెలియలేదని దుయ్యబట్టారు.

News February 16, 2025

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

image

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ ఇవాళ సాయంత్రం రానుంది. సా.5.30 గంటలకు జియో హాట్ స్టార్‌, స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం కానున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.

News February 16, 2025

యాగం చేసిన అనకాపల్లి ఎంపీ 

image

లోక కల్యాణార్థం సుదర్శన లక్ష్మీనరసింహ, లక్ష్మీ గణపతి, మృత్యుంజయ యాగం, మహా శాంతి హోమం నిర్వహించినట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో కుటుంబ సమేతంగా వీటిని నిర్వహించామన్నారు. కేంద్రం, రాష్ట్రంలోనూ ప్రజా సంక్షేమ ప్రభుత్వాలు వర్ధిల్లాలని.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే శక్తిని ప్రసాదించాలని కోరుతూ ఈ యాగం చేశామన్నారు.

error: Content is protected !!