News July 18, 2024
అధికారుల సహకారంతోనే సహజ వనరుల దోపిడీ: జనసేన

అధికారుల సహకారంతోనే సహజ వనరుల దోపిడీ జరుగుతుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. గురువారం విశాఖలో పౌర గ్రంథాలయంలో జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇందుకు అధికారులే బాధ్యత వహించాలన్నారు. విశాఖలో ఎర్రమట్టి దిబ్బలను రక్షించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు.
Similar News
News October 30, 2025
విశాఖలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కారణమిదే

భవనం నిర్మించుకుంటే డబ్బులు ఇవ్వాలంటూ ముగ్గురు బెదిరిస్తున్నారని మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. రాంజీ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్ తన ఇంటిపై అదనపు అంతస్తు నిర్మిస్తుండగా ఇదే ప్రాంతానికి చెందిన నర్సింగరావు, అరుణ్ బాబు, శంకర్రావు బెదిరించడం వల్లే తాను అత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రసాద్ సెల్ఫీ వీడియోలో చెప్పాడు. దీంతో కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 30, 2025
విశాఖలో బెండకాయలు రూ.54

విశాఖ రైతు బజార్‌లలో కూరగాయల ధరలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు గురువారం విడుదల చేశారు. వాటి వివరాలు (రూ.కిలో) టమాటా రూ.30, ఉల్లిపాయలు రూ.20/22, వంకాయలు రూ.40/44/54, బెండకాయ రూ.54, మిర్చి రూ.40, కాకరకాయ రూ.36, అనపకాయ రూ.26, క్యాబేజీ రూ.24, దొండ రూ.42, బీన్స్ రూ.66, పోటల్స్ రూ.62, చిలకడ రూ.30, కంద రూ.52, బద్ద చిక్కుడు రూ.66, తీపిగుమ్మిడి రూ.30, కరివేపాకు రూ.50, బీరకాయ రూ.46గా ఉన్నాయి.
News October 30, 2025
‘83 పునరావాస కేంద్రాల్లో 1516 మందికి ఆశ్రయం’

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 83 పునరాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో 1,516 మంది ఆశ్రయం పొందారు. ములగాడ మండలంలో 7 పునరావాస కేంద్రాల్లో 782 మంది ఆశ్రయం పొందారు. మహారాణిపేటలో 7 పునరావాస కేంద్రాల్లో అత్యధికంగా 520 మంది ఆశ్రయం పొందారు. సీతమ్మధార మండలంలోని 7 పునరావస కేంద్రాల్లో 82 మందికి ఆశ్రయం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.


