News July 24, 2024
అధికార యంత్రంగం సమష్టిగా పనిచేయాలి: కలెక్టర్ నాగలక్ష్మి

రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్గా భార్గవ్ తేజ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన కలెక్టర్ను కలిసి పుప్పగుచ్ఛం అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రెవెన్యూ, పౌరసరఫరాల వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా కృషి చేయాలని చెప్పారు.
Similar News
News December 10, 2025
క్రిస్మస్ రద్దీకి గుంటూరు మీదగా ప్రత్యేక రైళ్లు

క్రిస్మస్ సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ గుంటూరు మార్గంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. చర్లపల్లి–కాకినాడటౌన్ ప్రత్యేక రైలు (07196) ఈ నెల 24, 30 తేదీల్లో రాత్రి 7.30కి బయలుదేరుతుంది. పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడటౌన్ చేరుతుంది. కాకినాడటౌన్–చర్లపల్లి (07195) ఈ నెల 28, 31 తేదీల్లో సాయంత్రం 7.50కి స్టార్ట్ అయ్యి గుంటూరు మీదుగా వెళ్తుంది.
News December 9, 2025
గుంటూరు NHM–NTEP పోస్టుల ఎంపిక జాబితా విడుదల

గుంటూరు జిల్లాలో ఎయిడ్స్, టి.బి విభాగంలో ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు జిల్లా DMHO విజయలక్ష్మి తెలిపారు. ఎంపికైన వారు డిసెంబర్ 10న మధ్యాహ్నం 2.30 గంటలకు అసలు సర్టిఫికెట్లతో గుంటూరు DMHO కార్యాలయంలో అభ్యర్థులు సమయానికి హాజరుకావాలని సూచించారు. ఎంపిక జాబితా జిల్లా అధికారిక వెబ్సైట్ guntur.ap.gov.inలో అందుబాటులో ఉందన్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని తెలిపారు.