News July 22, 2024
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

అధిక వర్షాలు, వరదలపై జిల్లా యంత్రాగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఢిల్లీ నుంచి ఆయన కలెక్టర్ ప్రశాంతితో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. వర్షాలు, వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News October 14, 2025
భీమవరం: అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ నాగరాణి పీజీఆర్ఎస్లో దేవాదాయ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసంలో దేవాలయాలు శోభాయమానంగా ఉండేలా సిద్ధం చేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పేరుపాలెం బీచ్ వద్ద సముద్ర స్నానాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
News October 13, 2025
భీమవరం: నేటి పీజీఆర్ఎస్కు 95 అర్జీలు

భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 95 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 13, 2025
తణుకు: గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

తణుకు మండలం పైడిపర్రు కాలువలో పడి గల్లంతైన బొమ్మనబోయిన జోగేంద్ర (13) మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. జోగేంద్ర తన స్నేహితులతో కలిసి ఆడుకుందామని వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. అత్తిలి మండలం గుమ్మంపాడు సమీపంలో కాలువలో బాలుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.