News March 19, 2025
అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్‌పామ్ సాగుచేయండి: వరంగల్ కలెక్టర్

రైతులు తక్కువ నీరు, అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ సత్య శారదా కోరారు. మంగళవారం కలెక్టరేట్లో రాష్ట్ర ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు వరి, మొక్కజొన్న పంటల సాగుపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని, ఈ పంటలకు ఎక్కువ పెట్టుబడి చేయాల్సి వస్తుందని అన్నారు.
Similar News
News November 24, 2025
తిరుచానూరులో పంచమి తీర్థం.. పటిష్ఠ భద్రత

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 25న మంగళవారం పంచమి తీర్థం జరగనుంది. లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో టీటీడీ, పోలీస్ శాఖ భద్రత కట్టుదిట్టం చేసింది. టీటీడీ విజిలెన్స్ 600 మంది, స్కౌట్ అండ్ గైడ్స్ 200 మంది, NCC విద్యార్థులు 200 మంది, శ్రీవారి సేవకులు 900 మంది, పోలీస్ సిబ్బంది 1600 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.
News November 24, 2025
NRPT: 108లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

EMRI (108) అంబులెన్స్ సేవలో EMT పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా సూపర్వైజర్ రాఘవేంద్ర తెలిపారు. అర్హతలు: B.Sc (BZC), B.Sc నర్సింగ్, GNM, B.ఫార్మా, D.ఫార్మా, DMLT, MLT వయసు 30 ఏళ్లు, మంగళవారం మక్తల్‌లో జరిగే ఇంటర్వ్యూల ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు జతల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని తెలిపారు. నర్వ, మక్తల్ మాగనూరు, కృష్ణ మండలాల అంబులెన్స్‌లలో విధులు ఉంటాయన్నారు.
News November 24, 2025
మూడు రోజులు గోదావరి జిల్లాలలోనే మంత్రి..!

మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం నుంచి 26వ తేదీ వరకు ఉభయగోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. సోమవారం ఉ.8. గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం చేరుకుంటారు. అక్కడ డిప్యూటీ సీఎంతో కలిసి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం తూ.గో జిల్లా దేవరపల్లి, రాజమండ్రిలో అధికారులు, ప్రజాప్రతినిధులతో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.


