News March 19, 2025

అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్‌పామ్‌ సాగుచేయండి: వరంగల్ కలెక్టర్

image

రైతులు త‌క్కువ నీరు, అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్‌పామ్‌ సాగు చేసేందుకు ముందుకు రావాలని జిల్లా క‌లెక్ట‌ర్ సత్య శారదా కోరారు. మంగళవారం కలెక్టరేట్లో రాష్ట్ర ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు వరి, మొక్కజొన్న పంటల సాగుపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని, ఈ పంటలకు ఎక్కువ పెట్టుబడి చేయాల్సి వస్తుందని అన్నారు.

Similar News

News April 20, 2025

KMR: స్విమ్మింగ్ ఫూల్‌లో మునిగి యువకుడి మృతి

image

బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. బంధువుల ఇంట్లో పెద్దమ్మ తల్లి ఉత్సవాల కోసం వెళ్లిన నగేష్ అనే యువకుడు సరదాగా స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడానికి వెళ్లాడు. స్విమ్మింగ్ ఫూల్‌లో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నగేష్ హైదరాబాద్ వాసిగా పోలీసులు గుర్తించారు.

News April 20, 2025

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: నిర్మల్ కలెక్టర్

image

రైతుల సౌకర్యార్థం నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గడువులోగా జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి కొనుగోలును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News April 20, 2025

16,347 పోస్టులు: జిల్లాలు, సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా..

image

AP: రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ ఉ.10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందులో జిల్లా స్థాయిలో 14,088, స్టేట్, జోన్ లెవెల్‌లో 2,259 పోస్టులున్నాయి. అలాగే 7,487 స్కూల్ అసిస్టెంట్లు, 6,599 సెకండరీ గ్రేడ్ టీచర్ల ఖాళీలున్నాయి. 13 ఉమ్మడి జిల్లాలు, సబ్జెక్టుల వారీగా పూర్తి ఖాళీల వివరాల కోసం <>ఇక్కడ క్లిక్ చేయండి.<<>>
#SHARE

error: Content is protected !!