News June 29, 2024

అధైర్యపడవద్దు.. అండగా ఉంటాం: కడప ఎంపీ

image

‘అధైర్యపడవద్దు, అందరికీ అండగా ఉంటాం’ అని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. శనివారం వేములలోని మండలంలోని కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొందర్లోనే మళ్లీ అధికారంలోకి వస్తామని, ఈ ఐదేళ్లు ఐదు రోజుల్లా గడిచిపోతాయని ఆయన వారికి ధైర్యం చెప్పారు. ప్రజా తీర్పును మనం గౌరవించాలని ఆయన కోరారు. అలాగే మండలంలోని పలు సమస్యలపై వారితో మాట్లాడారు.

Similar News

News October 12, 2024

నేడు కడప – అరక్కోణం రైలు రద్దు

image

చెన్నై సమీపంలో నిన్న రాత్రి జరిగిన రైలు ప్రమాదం కారణంగా కొన్ని రైళ్ళను దారి మళ్లించారు. మరికొన్ని రైళ్ళను రద్దు చేశారు. అందులో భాగంగా కడప నుంచి అరక్కోణం వెళ్ళే రైలు నం 06402 నేడు రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.

News October 12, 2024

దసరా వేడుకలకు కడప జిల్లాలో భారీ బందోబస్తు

image

కడప జిల్లా వ్యాప్తంగా దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. దసరా వేడుకలకు రెండవ మైసూర్‌గా ప్రసిద్ధిగాంచిన ప్రొద్దుటూరుతోపాటు కడపలో శమీ దర్శనం, ఉత్సవాలకు తలమానికం. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి తొట్టి మెరవని ఊరేగింపు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేశామన్నారు.

News October 12, 2024

కడప జిల్లాలో 139 దుకాణాలకు 3,235 దరఖాస్తులు

image

కడప జిల్లా వ్యాప్తంగా 139 నూతన ప్రైవేటు మద్యం దుకాణాలకు 3,235 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.64.70 కోట్ల ఆదాయం వచ్చింది. ధరఖాస్తుల ఆదారంగా ఈనెల 14న లాటరీ విదానం ద్వారా కడప కలెక్టర్ శివశంకర్ ఆద్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరగనుంది. 16 నుంచి షాపుల నిర్వహన కొనసాగనుంది.