News June 20, 2024

అధైర్యపడొద్దని చెప్పారు: తానేటి వనిత

image

జిల్లా వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఓటమిపై నేతలెవరూ అధైర్యపడొద్దని సూచించినట్లు మాజీ మంత్రి తానేటి వనిత చెప్పారు. గెలుపోటములు సహజమేనని, మన ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేశామని చెప్పినట్లు వివరించారు. వైసీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షమే అని, ప్రజా సమస్యలపై పోరాటానికి నేతలందరూ సిద్ధంగా ఉండాలని జగన్ సూచించారన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రతిఒక్కరూ పని చేయాలని చెప్పారన్నారు.

Similar News

News September 8, 2024

ఏలూరు: 108 పాదరసాల శివలింగం.. మీరు వెళ్లారా..?

image

కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో ‘108 పాదరసాల శివలింగం’ భక్తుల పూజలందుకుంటోంది. శివకుమార్ అనే మహర్షి రాష్ట్రాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చిన సందర్భంలో లింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ లింగాన్ని పూజిస్తే కోటి లింగాలకు పూజ చేసిన ఫలితం కలుగుతందని భక్తుల నమ్మకం. ఏటా శివరాత్రికి ముందు రోజు అన్నపూర్ణకు, శివునికి వివాహం జరుపుతారని, పాదరసాలతోనే అభిషేకాలు చేస్తారు. మీరు ఎపుడైనా వెళ్లారా..?

News September 8, 2024

ఏలూరు: ఈ నెల 10న జాబ్ మేళా

image

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో భీమడోలు శ్రీ వెంకటేశ్వర కళాశాల (స్కిల్ హబ్)లో ఈ నెల 10వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి సుధాకర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 180 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 30ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపారు.

News September 8, 2024

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పర్యటన రద్దు

image

ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ రేపటి పర్యటన రద్దు అయినట్లు ఎంపీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పర్యటన రద్దయిందని, తిరిగి కొత్త షెడ్యూల్‌ను మళ్లీ వెల్లడిస్తామని తెలియజేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు సైతం వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు.