News February 24, 2025
అధైర్య పడొద్దు.. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం: ఎమ్మెల్యే బొజ్జు

ఉట్నూర్ మండలం లక్షటిపేటకు చెందిన ఉప్పు నర్సయ్య ఇండ్లు ప్రమాదవశాత్తు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యి సర్వం కోల్పోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆదివారం బాధిత కుటుంబానికి పరామర్శించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. నర్సయ్య కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఆధైర్యపడవద్దని త్వరలో ఇందిరమ్మ ఇళ్ల ఇస్తామన్నారు.
Similar News
News March 20, 2025
ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలెర్ట్.. మూడ్రోజులు వర్షాలు

రానున్న మూడు రోజులు ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం చేకూర్చనుంది. కానీ చేతికొస్తున్న పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
News March 20, 2025
ADB: ఈసారైనా స్టేట్‌లో సింగిల్ డిజిట్ వచ్చేనా..!?

పదో తరగతి పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ, శ్రద్ధ వహించారు. గత 2023 సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 92.93 శాతంతో ఆదిలాబాద్ 17వ స్థానంలో నిలవగా 2022లో 19వ స్థానంలో నిలిచింది. ఈసారి వంద శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవడానికి చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ప్రత్యేక ప్రణాళిక చేపట్టి వెనుకబడిన విద్యార్థులపై ఫోకస్ చేశారు.
News March 20, 2025
ఆదిలాబాద్: రేపటి నుంచి పది పరీక్షలు.. 52 కేంద్రాలు

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షల కోసం మొత్తం 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 21 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 10,106 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు బాలురు 5058, బాలికలు 4993, మొత్తం 10051 మంది ఉన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144, 163 అమలు చేసి పకడ్బందీగా చేపట్టనున్నారు.