News January 7, 2025
అనంతకు ‘డాకు’ టీమ్
అనంతపురంలో ఈ నెల 9న ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న విషయం తెలిసిందే. సినీ తారలు సీమకు తరలిరానున్నారు. హీరో బాలకృష్ణ, కథానాయికలు ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, గ్లామర్ రోల్‌లో కనిపించిన ఊర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ అనంతలో సందడి చేయనున్నారు. ముఖ్యఅతిథిగా మంత్రి నారా లోకేశ్ రానున్నారు. బాలయ్య ఫ్యాన్స్ ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ARTS కళాశాల మైదానంలో ఈవెంట్ జరగనుంది.
Similar News
News January 16, 2025
కశ్మీర్‌లో ప్రాణాలొదిలిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్
ధర్మవరానికి చెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వెంకట రమణారెడ్డి (40) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కశ్మీర్ బార్డర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో గుండెపోటుకు గురై మృతి చెందారు. ఇవాళ మృతదేహాన్ని బసినేపల్లికి తీసుకురానున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
News January 16, 2025
అనంతపురంలో ‘డాకు మహారాజ్’ విజయోత్సవ వేడుక!
హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈనెల 12న రిలీజైన ఈ మూవీ తొలిరోజే రూ.56కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఈ మూవీ విజయోత్సవ వేడుకలను అనంతపురంలో నిర్వహించేందకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి ఘటన కారణంగా అనంతలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో విజయోత్సవ వేడుకలను అక్కడే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
News January 16, 2025
పెనుకొండ దారుణ ఘటన.. 22 మందిపై కేసు
ప్రేమికులు పారిపోవడానికి సహకరించిందన్న నెపంతో మహిళను వివస్త్రను <<15165737>>చేసి<<>> జుట్టు కత్తిరించిన ఘటన చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో జరిగిన ఈ దారుణ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు 22 మందిపై కేసు నమోదు చేసినట్లు కియా పోలీసులు తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకున్నారు.