News July 14, 2024
అనంతగిరికి పోటెత్తిన హైదరాబాదీలు
అనంతగిరికి పర్యాటకులు పోటెత్తారు. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉండడంతో వికారాబాద్ జిల్లాకు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఉదయం ప్రఖ్యాత శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. కోట్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్ ఉండడంతో టూరిస్టులతో సందడిగా మారింది.
Similar News
News October 8, 2024
HYDRAపై రేపు MLA KVR ప్రెస్‌మీట్
HYD సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో రేపు మ.12 గంటలకు కామారెడ్డి BJP MLA కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ‘హైడ్రా’ పనితీరు గురించి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే హైడ్రా పనితీరును కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. మరి KVR ఏం చెబుతారో ఉత్కంఠ నెలకొంది.
News October 8, 2024
ఎన్కౌంటర్లకు నిరసనగా వచ్చే నెల భారీ ధర్నా: ప్రొఫెసర్
చత్తీస్‌గడ్‌లో ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక డిమాండ్ చేసింది. మంగళవారం బషీర్‌బాగ్‌లో వేదిక ప్రతినిధులు ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడారు. మధ్య భారత దేశంలో గత 10 నెలలుగా కొనసాగుతున్న ఆదివాసి హత్యాకాండ మరింత తీవ్రమైందన్నారు. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా నవంబర్ 3న ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News October 8, 2024
HYD: మాజీ ఉపరాష్ట్రపతిని కలిసిన ఎమ్మెల్యేలు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రేయారెడ్డి వివాహానికి రావాల్సిందిగా వెంకయ్య నాయుడుకి ఆహ్వాన పత్రికను అందజేశారు. తప్పకుండా హాజరవుతామని వెంకయ్య నాయుడు తెలిపారు.