News March 10, 2025
అనంతగిరి: కుక్కల దాడిలో జింక మృతి

వీధి కుక్కల వేటలో జింక (దుప్పి ) మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవిలో వీధి కుక్కల వేటలో జింక మృతి(దుప్పి ) చెందిందని స్థానికులు తెలిపారు. ఉదయం గుంపుగా వచ్చిన కుక్కలు మూగజీవాలపై విరుచుకుపడ్డాయని చెప్పారు.
Similar News
News February 9, 2026
గేమింగ్ స్కామ్.. ఏకంగా రూ.5 వేల కోట్లు!

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్‌ను DGGI అధికారులు బయటపెట్టారు. ఫిన్‌టెక్ పేరుతో ₹5వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు తేల్చారు. పలు వెబ్‌సైట్లతో అక్రమ దందా చేశారని, GST ఎగ్గొట్టారని తెలుస్తోంది. ఓషనీక్ వెబ్ సొల్యూషన్స్, వెబ్‌విన్ సొల్యూషన్స్ అనే షెల్ కంపెనీలకు రెంటెడ్ ఖాతాలతో నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని, మాస్టర్‌మైండ్ దుబాయ్‌లో ఉన్నాడని సమాచారం.
News February 9, 2026
మోత్కూరు: బాండ్ పేపర్‌పై హామీలు.. నచ్చకపోతే రిజైన్

మోత్కూరు మున్సిపాలిటీ 1వ వార్డు స్వతంత్ర అభ్యర్థి గుమ్మడవెల్లి పరశురాములు రూ.100 బాండ్ పేపర్‌పై తన ఎన్నికల హామీలను రాసి ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. తనను గెలిపిస్తే ఐదేళ్ల జీతాన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వెచ్చిస్తానని, రెండున్నరేళ్ల తర్వాత తన పని నచ్చకపోతే రాజీనామా చేస్తానని బాండ్ సాక్షిగా హామీ ఇచ్చారు. అవినీతికి పాల్పడనని, ఓటర్లను ప్రలోభపెట్టనని ఆయన స్పష్టం చేశారు.
News February 9, 2026
రేవంత్‌కు ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చే ముఖం లేదు: హరీశ్‌రావు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చే ముఖం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ స్కీముల పేరుతో అధికారంలోకి వచ్చి స్కామ్‌లకు తెరలేపిందని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని, కేవలం అవినీతే రాజ్యమేలుతోందని ఆయన ధ్వజమెత్తారు.


