News March 3, 2025
అనంతగిరి: పదేళ్ల బాలికపై 30 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులు

బాలికపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన పదేళ్ల బాలికను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు తెలపగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.
Similar News
News March 21, 2025
సజావుగా పదో తరగతి పరీక్షలు: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగుతున్నాయని, పొరపాట్లకు తావులేకుండా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం విజయవాడ సూర్యారావుపేటలోని కర్నాటి రామ్మోహన్‌రావు మునిసిపల్ ఉన్నతపాఠశాల పరీక్ష కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను అయన పరిశీలించారు.
News March 21, 2025
గుడిహత్నూర్‌లో క్లినిక్ సీజ్

గుడిహత్నూర్‌లోని ఓ క్లినిక్‌ను అధికారులు సీజ్ చేశారు. సూర్యవంశీ అనే RMP వైద్యుడు తన పరిధికి మించి ఓ గర్భం దాల్చిన బాలికకు అబార్షన్ పిల్స్ ఇచ్చారు. విషయం తెలుసుకున్న DMHO డా.నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు అధికారులు సదరు క్లినిక్‌ను సీజ్ చేశారు. జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్న RMPలు కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని, పరిధికి మించి వైద్యం అందిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 21, 2025
అల్లూరి జిల్లాలో 89మంది విద్యార్థులు గైర్హాజర్

అల్లూరి జిల్లాలో శుక్రవారం 71పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి ఇంగ్లిష్ ఎగ్జామ్ జరిగింది. వివిధ పాఠశాలలకు చెందిన మొత్తం 11547మంది విద్యార్థులకు 11458మంది హాజరయ్యారని, 89మంది ఆబ్సెంట్ అయ్యారని DEO. బ్రాహ్మజీరావు తెలిపారు. చింతపల్లిలో 4 సెంటర్స్‌ను ఆయన తనిఖీ చేశారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.