News March 2, 2025
అనంతగిరి: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు

మైనర్తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. అనంతగిరి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన బాలిక ఇంట్లోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈక్రమంలో ఆమె కేకలు వేయడంతో గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో అతడు పారిపోయాడు. విషయాన్ని బాలిక అక్కకు చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.
Similar News
News November 28, 2025
విశాఖ బాలోత్సవం పోస్టర్ ఆవిష్కరణ

విశాఖలో బాలోత్సవం పోస్టర్ను జీవీఎంసీ కమీషనర్ కేతన్ గార్గ్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈసారి ఉత్సవాలు విశాఖ వ్యాలీ రోటరీతో కలిసి నిర్వహిస్తున్నామని బాలోత్సవం కార్యదర్శి రాజేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే కలెక్టర్, జీవీఎంసీ కమీషనర్, DEO, నగరంలోని 56 మంది ప్రముఖులతో ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
News November 28, 2025
భీమవరం: ‘టెట్ నుంచి మినహాయింపు ఇవ్వండి’

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TET) మినహాయింపు ఇవ్వాలని కోరుతూ యూటీఎఫ్ (UTF) నాయకులు శుక్రవారం భీమవరంలోని కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు, ప్రధాన కార్యదర్శి రామభద్రం తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
News November 28, 2025
2027 WCకు రోహిత్, కోహ్లీ.. కోచ్ ఏమన్నారంటే?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉందని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ అభిప్రాయపడ్డారు. పెద్ద టోర్నీల్లో వారి అనుభవం జట్టుకు కీలకమని అన్నారు. శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉంటే కచ్చితంగా ఆడతారని తెలిపారు. కాగా గత ఆస్ట్రేలియా సిరీస్లో రోహిత్ రాణించిన విషయం తెలిసిందే. ఆదివారం నుంచి SAతో జరగనున్న మూడు వన్డేల సిరీస్లో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు.


