News May 11, 2024
అనంతపురంలోకి 100 మంది బయటి వ్యక్తులు..?

ఎన్నికల నేపథ్యంలో అనంతపురంలో అల్లర్లు సృష్టించడానికి వంద మంది బయటి వ్యక్తులు నగరానికి వచ్చినట్లు జనసేన నేత జయరామిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు డీఎస్పీ టీవీవీ ప్రతాప్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి అల్లుడు వారిని తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన డీఎస్పీ.. తాము నగరంలో సోదాలు జరుపుతామని జయరామిరెడ్డికి హామీ ఇచ్చారు.
Similar News
News March 5, 2026
బుక్కరాయసముద్రం: 10 నుంచి ఉచిత శిక్షణ

బుక్కరాయ సముద్రం ఆర్డీటీ స్కూల్లో ఈ నెల 10వ తేదీ ఇగ్నైట్ వ్యాపార శిక్షణ నిర్వహిస్తున్నట్లు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో చంద్రమౌళి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులను వ్యాపారవేత్తలుగా మార్చడానికి ఐదు రోజులు శిక్షణ అందిస్తున్నామన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు గల దివ్యాంగులు ఈ శిక్షణకు అర్హులని చెప్పారు. ఉచిత వసతి, భోజనం సదుపాయాలు కల్పిస్తామన్నారు.
News March 5, 2026
తాడిపత్రిలో రైలు పట్టాలపై పడుకుని..!

తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ఓ వ్యక్తి గురువారం హల్‌చల్ చేశాడు. రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన గూడ్స్ రైలు పైలట్ అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేశాడు. అనంతరం ఆ వ్యక్తిని హెచ్చరించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పుట్లూరు రోడ్డు రైల్వే గేట్ సుమారు 10 నిమిషాలు ఆలస్యంగా తెరుచుకుంది.
News March 5, 2026
అనంత: పక్కాగా జనగణన

అనంతపురం జిల్లాలో 16వ జనగణన కార్యక్రమాన్ని సమగ్రంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ అధికారులకు సూచించారు. జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు మొదటి దశలో హౌస్ లిస్టింగ్ నిర్వహించి ప్రతి ఇంటి వివరాలు నమోదు చేయాలని చెప్పారు. డేటా సేకరణలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించి ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.


