News October 21, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.45

image

అనంతపురంలో టమాటా ధరలు నిలకడగా ఉన్నాయి. నగర శివారులోని కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న కిలో గరిష్ఠంగా రూ.45 పలికింది. కనిష్ఠంగా రూ.25, సరాసరి రూ.36తో క్రయవిక్రయాలు జరిగాయి. మరోవైపు ఇటీవల వర్షాలకు జిల్లాలోని పలు మండలాల్లో పంట దెబ్బతినింది.

Similar News

News December 30, 2025

నీటి తొట్టెలో పడి అనంతపురం జిల్లా చిన్నారి మృతి

image

కళ్యాణదుర్గం మండలం ఈస్ట్ కోడిపల్లిలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. స్థానిక రామాంజనేయులు, అశ్వని దంపతుల కుమార్తె ఈక్షిత (2) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి ఊపిరాడక మృతి చెందింది. ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్ల ముందే కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News December 30, 2025

నూతన సంవత్సర వేడుకలపై SP ఆంక్షలు

image

అనంతపురంలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా SP జగదీష్ ఆంక్షలు విధించారు. వేడుకలు రాత్రి 1 లోపు ముగించాలని ప్రకటించారు. రహదారులను బ్లాక్ చేసి వేడుకలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్ చేయవద్దన్నారు. సైలెన్సర్ తొలగించి శబ్ద కాలుష్యం సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం దుకాణాలను నిర్ణీత సమయానికి మూసివేయాలని హెచ్చరించారు.

News December 30, 2025

టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులపై జిల్లా స్థాయి సమావేశం

image

రాయదుర్గం టెక్స్‌టైల్ పార్క్‌లో త్వరితగతిన గార్మెంట్ యూనిట్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ ఆనంద్ అనంతపురంలో నిర్వహించారు. ఇది వరకే ప్లాట్లు పొంది నేటికి యూనిట్ల నిర్మాణం చేపట్టని 47 మంది యూనిట్ హోల్డర్లతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇది చివరి అవకాశంగా తెలియజేసి కేటాయించిన ప్లాట్లలో తక్షణమే యూనిట్లను నిర్మాణం చేసేలాగా జిల్లా జౌళిశాఖ అధికారిని ఆదేశించారు.