News September 30, 2024
అనంతపురంలో కిలో టమాటా రూ.47
అనంతపురంలో టమాటా ధర వారం రోజులుగా నిలకడగా ఉంది. కక్కలపల్లి మార్కెట్‌లో కిలో రూ.47 పలికినట్లు మార్కెటింగ్ శాఖ కార్యదర్శి రామ్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మార్కెట్‌కు 1350 టన్నుల టమాటాలు వచ్చాయని చెప్పారు. సరాసరి ధర కిలో రూ.38, కనిష్ఠంగా రూ.30 పలికినట్లు పేర్కొన్నారు. ధరలు నిలకడగా కొనసాగుతుండటంతో రైతుల్లో ఆనందం నెలకొంది.
Similar News
News October 5, 2024
అనంత జిల్లా విజన్ ప్లాన్ తయారీపై సమావేశం
స్వర్ణాంద్ర 2047 జిల్లా విజన్ ప్లాన్ తయారీపై అనంతపురం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్‌లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ మహమ్మద్ వసీం పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగం అభివృద్ధి చెందడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 4, 2024
శ్రీ సత్యసాయి జిల్లాలో సినీ దర్శకుడి పర్యటన
మడకశిర నియోజకవర్గంలోని ప్రసిద్ధి చెందిన ముఖ్య దేవాలయాలను సినీ దర్శకుడు ధనరాజ్ శుక్రవారం సందర్శించారు. హేమావతిలోని ఎంజీఆర్ సిద్దేశ్వరస్వామి టెంపుల్, రోళ్ళలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, రత్నగిరి కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయం, చెందకచర్ల ఆంజనేయస్వామి టెంపుల్, మడకశిరలోని పూజమ్మ, శివాలయం, తదితర ఆలయాలను సందర్శించి ధూప, దీప నైవేద్యాలను కానుకగా సమర్పించారు. ప్రజలందరూ సంతోషంగా జీవించాలని కోరారు.
News October 4, 2024
రాజకీయాలంటే ప్రజలలో ఒక చులకన భావన: కేతిరెడ్డి
రాజకీయాలు అంటే ఇప్పటికే ప్రజల్లో ఒక చులకన భావంతో చూస్తున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఒక ఉన్నత పదవిలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించాలి కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయాల కోసం ఒక వ్యక్తి యొక్క కుటుంబ విషయాలను, వ్యక్తిగత విచారణ వాడుకోవడం ఒక నీచమైన చర్య అంటూ Xలో పోస్ట్ చేశారు.