News February 18, 2025
అనంతపురంలో చెట్టుకు ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థి సూసైడ్

అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు ధర్మవరం మండలం మాలకాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 28, 2025
జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా వాతావరణం కల్పించాలి: కలెక్టర్

కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన భూమి సిద్ధంగా ఉందని, ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా మంచి వాతావరణం కలగజేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 56వ జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
News March 28, 2025
పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేపట్టాలి: కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఏప్రిల్ 1న పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 1న పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సన్నద్ధతపై సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని, ముందుగా వెళ్లరాదని సూచించారు.
News March 28, 2025
నీ మొగుడి అలవాట్లే నీకు వచ్చాయి: తోపుదుర్తి

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక విషయంలో పరిటాల కుటుంబం ప్రజాసామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ‘నీ మొగుడి అలవాట్లే నీకు, నీ కొడుకులకు వచ్చాయి. మీకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. టీడీపీకి కేవలం ఒక ఎంపీటీసీ స్థానం ఉన్నా దౌర్జన్యంతో ఎంపీపీ పీఠం చేజిక్కుంచుకోవాలని చూస్తున్నారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.