News October 1, 2024

అనంతపురంలో టన్ను చీనీ రూ.18 వేలు

image

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో చీనీ కాయల ధరలు ముందుకు సాగడం లేదు. సోమవారం మార్కెట్‌కు 10టన్నుల చీనీ కాయలు దిగుమతి అయినట్లు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గోవిందు ఓ ప్రకటనలో తెలిపారు. అందులో గరిష్ఠంగా టన్ను రూ.18 వేలు, సరాసరి రూ.15 వేలు, కనిష్ఠంగా రూ.10 వేల ధర పలికినట్లు వెల్లడించారు. మార్కెట్‌లో ధరలు పెరగకపోవడంతో దిగుమతి తగ్గినట్లు తెలిపారు. మరోవైపు జిల్లాలో కిలో టమాటా గరిష్ఠంగా రూ.48 పలుకుతోంది.

Similar News

News October 16, 2024

సత్యసాయి: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

15 సంవత్సరాలు నిండిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. వయోజన విద్య అభివృద్ధిపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో మంగళవారం రాత్రి గూగుల్ మీట్ విధానం ద్వారా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.

News October 15, 2024

కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన సత్యసాయి జిల్లా జేసీ

image

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పరిశీలించారు. అల్పపీడన పరిస్థితుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన టీవీ ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం తెలపాలని కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

News October 15, 2024

అనంతపురం జిల్లా ప్రజలకు APSDMA హెచ్చరికలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలోని పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్ష సూచనతో విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తోంది. జిల్లా ప్రజల ఫోన్లకు APSDMA అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది. మరోవైపు జిల్లా అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నారు.