News October 26, 2024

అనంతపురంలో టమాటా కిలో రూ.32

image

అనంతపురం స్థానిక కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.32తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్‌ యార్డు కార్యదర్శి రాంప్రసాద్‌ తెలిపారు. మార్కెట్‌కు శుక్రవారం మొత్తంగా 1,275 టన్నుల టమాటా దిగుబడులు వచ్చినట్లు తెలిపారు. రెండ్రోజులుగా ధరలు పడిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 3, 2024

ఉరవకొండ: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

image

ఉరవకొండ పట్టణ శివారులోని 42వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన యువకుడు పట్టణానికి చెందిన అంజిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

News November 3, 2024

ప్రగతికి సంబంధించిన నివేదికలను సిద్ధం చేసుకోవాలి:

image

ఐదు నెలల కాలంలో జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి సాధించిన ప్రగతికి సంబంధించిన నివేదికలు సిద్ధం చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ రాష్ట్ర రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి సత్య ప్రసాద్ జిల్లా అభివృద్ధి సమావేశంలో పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు.