News August 23, 2024

అనంతపురంలో దులీప్ ట్రోఫీ.. తొలి మ్యాచ్ ఈ జట్ల మధ్యే

image

అనంతపురంలో దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ SEP 5-8 వరకు జరగనుంది. టీమ్-సీ, టీమ్-డీ జట్లు తలపడతాయి. మ్యాచ్ ఉ.9.30కు ప్రారంభమవుతుంది.
టీమ్-సీ: రుతురాజ్ (C), సుదర్శన్, రజత్, పోరెల్, SKY, ఇంద్రజిత్, హృతిక్, సుతార్, ఉమ్రాన్, విజయ్‌కుమార్, అన్షుల్, హిమాన్షు, మయాంక్, సందీప్
టీమ్-డీ: అయ్యర్ (C), అథర్వ తైడే, దూబే, పడిక్కల్, ఇషాన్, రికీ భుయ్, సరాంశ్, అక్షర్, అర్ష్‌దీప్, ఠాకరే, హర్షిత్, తుషార్, ఆకాశ్, భరత్, సౌరభ్

Similar News

News November 17, 2025

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నార్పల యువతి

image

5,895 మీటర్లు ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని నార్పల మండలం దుగుమర్రికి చెందిన యువతి కె. కుసుమ అధిరోహించారు. దీంతో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుసుమను ఆదివారం అభినందించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ పర్వతం, ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో శిఖరంపై కుసుమ (19) ఈ నెల 12న భారత జెండా ఆవిష్కరించడం గర్వకారణమన్నారు.

News November 16, 2025

నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డాక్టర్ కార్తీక్ రెడ్డి

image

బెలుగుప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌గా పనిచేస్తున్న కార్తీక్ రెడ్డి (39) పంపనూరు పుణ్యక్షేత్రంలో దైవ దర్శనానికి వచ్చి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పంపనూరు క్షేత్రంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దైవ దర్శనానికి వచ్చి సమీపంలోని కాలువలో స్నానానికి దిగగా నీటి ప్రవాహం ఎక్కువై కొట్టుకుపోయినట్లు వివరించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News November 16, 2025

రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.