News February 5, 2025
అనంతపురంలో నేత్ర స్వీకరణ కేంద్రం ప్రారంభం

అనంతపురం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం డీవై కుళ్లాయప్ప నేత్ర స్వీకరణ కేంద్రం ప్రారంభమైంది. కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రెడ్ క్రాస్ శరవేగంగా దూసుకుపోతోందని, ఇప్పటికే మెంబర్షిప్, సీఎస్ఆర్ కార్యక్రమంలో రాష్ట్రంలోనే ముందు ఉన్నామని తెలిపారు. కంటి దాన అంగీకార పత్రాల సేకరణలోనూ మన రెడ్ క్రాస్ ముందుండాలన్నారు.
Similar News
News February 9, 2025
పేరూరు గ్రామం నుంచి తిరుమలకు పాదయాత్ర

పేరూరు గ్రామం నుంచి తిరుమలకు పంచాగం మోహన్ స్వామి ఆధ్వర్యంలో భక్తులు శనివారం పాదయాత్రను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి మాల ధరించిన భక్తులు గ్రామంలోని ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసి, భజన చేసుకుంటూ తిరుమలకు పాదయాత్ర చేస్తామన్నారు. కార్యక్రమంలో దాసరి రాజ, వెంకటరెడ్డి, బెస్త నాగరాజు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
News February 8, 2025
మరుట్లలో 400 చీనీ చెట్లకు నిప్పు

కూడేరు మండలంలోని మరుట్ల రెండో కాలనీ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చిన్నకొండప్ప గారి శ్రీనివాస్ నాయుడు తోటలో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 400 చీనీ చెట్లు దగ్ధమయ్యాయి. డ్రిప్ పరికరాలు, పైప్లైన్ గేట్ వాల్స్ మొత్తం కాలి బూడిద అయ్యాయి. దాదాపుగా రూ.4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు తెలిపాడు.
News February 8, 2025
శైలజానాథ్‌కు కీలక పదవి ఇస్తారా?

పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరడంతో ఆ పార్టీ జిల్లా శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఎన్నికలకు మరో 4ఏళ్ల సమయం ఉండగా, కష్ట కాలంలో YCP తీర్థం పుచ్చుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా పార్టీకి ఆయన అదనపు బలం అని భావిస్తున్నాయి. మరోవైపు శైలజానాథ్‌కు జగన్ కీలక పదవి కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.