News May 21, 2024
అనంతపురంలో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

అనంతపురంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నగరంలో గాలివానకు 40 చెట్లు విరిగిపడటంతో పాటు 30 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ క్రమంలో నగరంలో సాయంత్రం 4.30 నుంచి రాత్రి 12 గంటల వరకు 75 శాతం ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అధికారులు, ఉద్యోగులు చెట్లు, స్తంభాలు పడిపోయిన ప్రాంతాలను పరిశీలించి మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News November 2, 2025
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News November 2, 2025
రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలి: కలెక్టర్

జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువుగా తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఆనంద్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్లోని మినీ కాన్ఫరెన్స్ లో భారతీయ రెడ్ క్రాస్ సమైక్య అనంతపురం శాఖ కార్యకలాపాలను సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రక్త కేంద్రాలలో సరిపడా రక్త నిల్వ ఉండేలా చూసుకోవడం ముఖ్యమైందని తెలిపారు.
News November 1, 2025
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. అనంతపురం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలో త్రైమాసికంలో జరిగిన మాతా శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అనంతపురం రూరల్ కురుగుంట-2, యాడికి-1, రాయదుర్గం-1, కొర్రపాడు-1 UPHCలో జరిగిన మాతృమరణాలపై కలెక్టర్ ఆరా తీశారు.


