News April 14, 2025
అనంతపురంలో పోలీసుల అవగాహన సదస్సు

జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు అనంతపురంలోని మూడవ పట్టణ పోలీసులు రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ఆదివారం ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు. ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్తో వాహనాలు వెళ్ళకూడదన్నారు. డ్రంకెన్ డ్రైవ్ చేయరాదన్నారు.
Similar News
News April 19, 2025
అనంత: స్వర్ణాంధ్ర కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష

అనంతపురంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం అన్ని శాఖలతో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వర్ణ ఆంధ్రా- స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ జరిగిందన్నారు. గ్రామస్థాయిలో పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News April 18, 2025
MEMU రైలు అనంతపురం వరకు..

అనంతపురం జిల్లా ప్రజలకు రైల్యే శాఖ తీపి కబురు చెప్పింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరుకు నడుస్తున్న MEMU రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ రైలు అనంతపురం-బెంగళూరు మధ్య పరుగులు పెట్టనుంది. KSR బెంగళూరులో ఉ.8.35 గంటలకు బయలు దేరి అనంతపురానికి మ.1.55 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అనంతలో మ.2.10 గంటలకు బయలుదేరి రాత్రి 7.50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.
News April 18, 2025
గుమ్మగట్ట: కరెంట్ షాక్తో టెన్త్ విద్యార్థి మృతి

గుమ్మగట్ట మండలం గొల్లపల్లిలో గురువారం రాత్రి విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి కార్తీక్ (16) ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. తండ్రితో కలిసి కుమారుడు పొలానికి వెళ్లాడు. మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. యువకుడు గత నెలలోనే పది పరీక్షలు రాశాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు.