News February 12, 2025
అనంతపురంలో భర్త హత్య.. భార్య మరో ఇద్దరి అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739325804979_727-normal-WIFI.webp)
కాశీ అనే వ్యక్తి హత్య కేసులో అతని భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అనంతపురం రూరల్ పోలీసులు తెలిపారు. కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈ నెల 2న అనంతపురం రూరల్ పరిధిలో కాశీని ఇద్దరితో కలిసి భార్యే హత్య చేసినట్టు వెల్లడైందన్నారు. నిందితులను ఆర్డీటీ స్టేడియం వద్ద అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు.
Similar News
News February 12, 2025
‘తండేల్’ కలెక్షన్ల ప్రభంజనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739350222467_1226-normal-WIFI.webp)
థియేటర్ల వద్ద ‘తండేల్’ మూవీ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ చిత్రం రూ.80.12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. వాలంటైన్స్ వీక్‌లో బ్లాక్ బస్టర్ తండేల్‌పై ప్రేమ అన్‌స్టాపబుల్‌గా కొనసాగుతుందని పేర్కొంది. నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తాయి.
News February 12, 2025
ఇక్ష్వాకు వంశంపై హరగోపాల్ ఏమన్నారంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739349436481_746-normal-WIFI.webp)
ఇక్ష్వాకుల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. పురాణాల ప్రకారం రాముడిది ఇక్ష్వాకు వంశం. అలాగే, తెలుగునాట కూడా ఈ పేరుతో ఓ రాజవంశం ఉండేది. శాతవాహనుల తరువాత పాలించింది ఆంధ్ర ఇక్ష్వాకులు. ‘ఏ కులం వారైనా ఇక్ష్వాకులు అని చెప్పడానికి ఏ ఆధారమూ లేదు. ఈ వంశం ఇప్పటి వరకూ కొనసాగి, ఎవరో ఒకరు ఇంకా ఉన్నారని చెప్పే అవకాశం లేదు. ఎవరైనా చెప్పుకున్నా దానికి సాక్ష్యం ఉండదు’ అని ప్రొఫెసర్ హరగోపాల్ చెబుతున్నారు.
News February 12, 2025
జేఈఈ మెయిన్స్‌లో గుండాల విద్యార్థుల ప్రతిభ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739340847372_51259851-normal-WIFI.webp)
ఎన్.టి.ఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్స్-2025 తొలి సెషన్ ఫలితాల్లో మారుమూల గిరిజన ప్రాంతమైన గుండాల గురుకుల కళాశాలకు విద్యార్థులు ప్రతిభ చూపారు. విద్యార్థులు డి.నరసింహ-78%, ఎన్.దేవిప్రసాద్-72%, జి.మనోహర్-58%, బి సతీశ్ కుమార్-57%, బి.గణేశ్-45% ఉత్తమ పర్సంటైల్ సాధించారు. కాగా విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ వి.సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ రామచంద్రరావు, అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.