News March 20, 2025
అనంతపురంలో యువతి ఆత్మహత్య

అనంతపురంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన మైథిలి అనే యువతి బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 10న మైథిలి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించింది. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 28, 2025
బ్లాక్ స్పాట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్, ఎస్పీ

అనంతపురం జిల్లాలో 37 బ్లాక్ స్పాట్లను గుర్తించగా.. ఆయా బ్లాక్ స్పాట్లలో రెండు వారాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. వారు మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రతినెల రోడ్డు భద్రతలో భాగంగా వితౌట్ హెల్మెట్తో ప్రయాణించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
News March 28, 2025
జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా వాతావరణం కల్పించాలి: కలెక్టర్

కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన భూమి సిద్ధంగా ఉందని, ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా మంచి వాతావరణం కలగజేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 56వ జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
News March 28, 2025
పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేపట్టాలి: కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఏప్రిల్ 1న పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 1న పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సన్నద్ధతపై సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని, ముందుగా వెళ్లరాదని సూచించారు.