News March 20, 2025
అనంతపురంలో యువతి ఆత్మహత్య

అనంతపురంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన మైథిలి అనే యువతి బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 10న మైథిలి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించింది. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 21, 2025
VKB: చలి దాడి ఎంతంటే.. పార్కులో కొంగ కూడా వణికింది!

వికారాబాద్లో ఉదయం వేళ చలి తీవ్రత పెరగడంతో పక్షులూ కూడా ఇబ్బంది పడుతున్నాయి. పట్టణంలోని ఒక పార్క్లో తెల్ల కొంగ (ఎగ్రెట్) చలికి వణుకుతున్న దృశ్యం కెమెరాలో రికార్డైంది. చెట్ల నీడలో నిలబడి చలి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ఈ పక్షిని చూసి అక్కడి ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ దృశ్యం స్థానికులను కలచివేసింది. చలి తీవ్రత జీవజాలంపై ఎంత ప్రభావం చూపుతోందో ఈ ఉదయం దృశ్యం స్పష్టంగా తెలియజేస్తోంది.
News November 21, 2025
నిర్మల్ జిల్లాకు రూ.కోటి రివార్డు

జాతీయ స్థాయి జల అవార్డుల్లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల విభాగంలో నిర్మల్ జిల్లా రెండవ స్థానంలో నిలవడం గర్వకారణమని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లాకు రూ. కోటి రివార్డు లభించడం విశేషమని తెలిపారు. అధికారుల సమిష్టి కృషి, ప్రజల విలువైన భాగస్వామ్యంతోనే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో పని చేసి, జిల్లాకు మరిన్ని ప్రతిష్టాత్మక అవార్డులు సాధించేందుకు కృషి చేయాలన్నారు.
News November 21, 2025
లీజుకు బంగారం.. ఇప్పుడిదే ట్రెండ్-1

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పండుగల సీజన్ నేపథ్యంలో ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో బడా ఇన్వెస్టర్లు కొత్త ట్రెండ్కు తెరతీశారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని అద్దె/లీజుకు ఇస్తున్నారు. బంగారు బిస్కెట్లు, కడ్డీలు వంటి వాటిని ఆభరణాల వ్యాపారులు, రిఫైనర్లు, తయారీదారులకు ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. తద్వారా బంగారంపై 2-7% ఆదాయం పొందుతున్నారు. ఇటు ధరల పెరుగుదల, అటు లీజ్ ద్వారా లాభపడుతున్నారు.


