News December 3, 2024
అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం ఓకే!

అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటుపై ముందడుగు పడింది. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. దీని నిర్మాణానికి 1,200ఎకరాలు కేటాయించాలని కేంద్ర మంత్రిత్వశాఖ రాష్ట్ర సర్కారును కోరినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. భూమి చూపిన వెంటనే తదుపరి కార్యాచరణ మొదలుకానుంది. అనంతపురం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ భూమి కేటాయిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Similar News
News October 22, 2025
పథకాలు, కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించండి: కలెక్టర్

వ్యవసాయ, అనుబంధ రంగాలలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలపై రైతులకు శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేసి, నూతన సాంకేతికతను తెలియజేయాలన్నారు. శిక్షణా కార్యక్రమాలకు ఆత్మ పీడీ నోడల్ అధికారిగా ఉండాలన్నారు.
News October 22, 2025
గుత్తి పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

గుత్తి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ జగదీశ్ బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. ముందుగా సీఐ రామారావు, ఎస్ఐ సురేశ్ గౌరవ వందనంతో ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు స్టేషన్ నిర్వహణ, పరిసర ప్రాంతాలు, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్‌లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
News October 22, 2025
ఎర్రచందనం అనుకొని తనిఖీలు.. తీరా చూస్తే సండ్ర మొద్దులు..!

యాడికి మండలం మీదుగా ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొలిమిగుండ్ల నుంచి బుగ్గ మీదుగా యాడికికి వస్తున్న ఐచర్ వాహనాన్ని సీఐ ఈరన్న తన సిబ్బంది నిలిసి తనిఖీ చేవారు. అయితే అవి సండ్ర మొద్దులు అని గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వాటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారన్నది తెలియాల్సి ఉంది.