News September 15, 2024
అనంతపురంలో 19న ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం

అనంతపురంలోని కలెక్టరేట్లో ఈ నెల 19న ఉదయం11 గంటలకు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో హంద్రీనీవా, మైనర్ ఇరిగేషన్తో పాటు హెచ్చెల్సీకి కేటాయించిన నీటి విడుదల తేదీలను ప్రకటిస్తామన్నారు. ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.
Similar News
News October 23, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక

ఇటీవల అనంతపురంలో జరిగిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలలో యాడికికి చెందిన విద్యార్థి తృషిత అత్యంత ప్రతిభ కనబరిచింది. దీంతో గుంతకల్ డివిజన్ జట్టుకు ఎంపికయింది. డివిజనల్ స్థాయి పోటీలలోనూ అత్యంత ప్రతిభ కనబరిచడంతో నిర్వాహకులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో తృషిత పాల్గొంటుంది.
News October 22, 2025
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: DMHO

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని DMHO దేవి వైద్యులకు సూచించారు. అనంతపురం జిల్లాలోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని వైద్యులు, సిబ్బందితో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన అర్జీలకు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. వైద్య సేవలపై ప్రజల్లో మంచి దృక్పథం వచ్చేలా ఆసుపత్రికి వచ్చిన రోగులకు సేవలను అందించాలన్నారు.
News October 22, 2025
పథకాలు, కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించండి: కలెక్టర్

వ్యవసాయ, అనుబంధ రంగాలలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలపై రైతులకు శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేసి, నూతన సాంకేతికతను తెలియజేయాలన్నారు. శిక్షణా కార్యక్రమాలకు ఆత్మ పీడీ నోడల్ అధికారిగా ఉండాలన్నారు.