News January 6, 2025
అనంతపురంలో KG టమాటా రూ.6

అనంతపురంలో టమాటా ధరలు బాగా పడిపోయాయి. నిన్న కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.10 పలికిందని రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ వెల్లడించారు. మరోవైపు కనిష్ఠ ధర రూ.6గా నమోదైందన్నారు. మొత్తంగా నిన్న ఒక్కరోజు మార్కెట్కు 1050 టన్నులు రాగా సరాసరిగా కిలో టమాటా రూ.8 పలికింది.
Similar News
News November 18, 2025
అర్జీలు త్వరగా పరిష్కరిస్తాం: అనంత కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. సమస్యల పరిష్కారంపై నిరంతర సమీక్ష ఉంటుందన్నారు.

News November 17, 2025
అనంతపురం: పోలీసుల PGRSకు 83 పిటిషన్లు.!

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం అర్బన్ DSP శ్రీనివాసరావు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా SP ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 83 పిటీషన్లు వచ్చాయి. పిటిషనర్లతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.