News August 31, 2024

అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై లారీ బోల్తా 

image

బేస్తవారిపేట పట్టణ సమీపంలోని అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నరసరావుపేట నుంచి గుంతకల్లు వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్ర మత్తులో లారీని డివైడర్‌పైకి ఎక్కించాడు. దీంతో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.

Similar News

News October 17, 2025

ప్రభుత్వాలు మారినా దోపిడీ ఆగడం లేదు..!

image

వెలిగొండ ప్రాజెక్ట్ పనులకు ప్రభుత్వం ఇటీవల రూ.456కోట్లు ఇవ్వగా త్వరలోనే R&R ప్యాకేజీ విడుదల చేయనుంది. సుంకేసుల, కలనూతల, గుండంచెర్లలోని 5వేలమందికి ఈ పరిహారం అందనుంది. ఈక్రమంలో కొందరు నాయకులు పరిహారం కావాలంటే ముందుగా రూ.20వేలు ఇవ్వాలని నిర్వాసితుల నుంచి వసూళ్లు చేస్తున్నారంట. గత ప్రభుత్వంలోనూ ఇలాగే నాయకులు దోపిడీ చేయగా కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. మిమ్మల్ని ఇప్పుడు ఎంత అడిగారో కామెంట్ చేయండి.

News October 16, 2025

ప్రకాశం జిల్లాలో 2 హైవేలు ప్రారంభం.!

image

కర్నూలు జీఎస్టీ సభ వేదికగా ప్రధాని మోదీ వివిధ పనులను గురువారం ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. వాటిలో ప్రకాశం జిల్లాలో (1) కనిగిరి బైపాస్ (2) సీఎస్‌పురం 2 లైన్ బైపాస్‌లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.

News October 16, 2025

ప్రకాశం వంటకాలలో స్పెషల్ ఇదే!

image

నేడు ప్రపంచ భోజన దినోత్సవం. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వంటకాల స్పెషాలిటీ చూస్తే నోరు ఊరాల్సిందే. జిల్లాలో ప్రధానంగా ఊరగాయ పచ్చళ్లు వెరీ ఫేమస్ అని చెప్పవచ్చు. అంతేకాదు ఒంగోలు నగరానికి ఎవరైనా వచ్చారంటే చాలు.. ఇక్కడి వంటకమైన మైసూర్ పాక్‌ను రుచి చూడాల్సిందే. ఒంగోలు నగరం నుంచి విదేశాలకు కూడా మైసూర్ పాక్ తరలి వెళుతుందంటే.. ఆశ్చర్యం కలిగించక మానదు. మరి మీరు మైసూర్ పాక్ టేస్ట్ అనే చేశారా!