News February 17, 2025
అనంతపురం: అలర్ట్.. గ్రీవెన్స్‌డే స్థలంలో మార్పు

రాయదుర్గం పట్టణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని బళ్లారి రోడ్డు సీతారామాంజనేయ కళ్యాణమండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్వామా హాలు నుంచి సీతారామాంజనేయ కళ్యాణ మంటపానికి మార్చినట్లు కలెక్టర్ అధికార వర్గాలు తెలిపాయి. ప్రజలు ఈ స్థల మార్పును గమనించాలని కోరారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
Similar News
News March 17, 2025
అనంతపురం: డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ అరెస్ట్

ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటపతిని అరెస్ట్ చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. వెంకటపతికి కౌన్సెలింగ్ ఇచ్చి కోర్ట్‌లో హాజరు పరిచినట్లు సీఐ పేర్కొన్నారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ వెల్లడించారు. కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ వెంకటపతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సీఐ తెలిపారు.
News March 16, 2025
భారత త్రో బాల్ జట్టుకు ఎంపికైన వెన్నపూస రోషీ రెడ్డి

భారత త్రో బాల్ జట్టుకు అనంతపురానికి చెందిన వెన్నుపూస రోషీ రెడ్డి ఎంపికయ్యారు. భారత పారా త్రో బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఆల్బర్ట్ ప్రేమ్ కుమార్ ఎంపికైన లేఖను పంపించినట్లు రోషీ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా దివ్యాంగుల క్రికెట్ సంఘం అధ్యక్షులు డాక్టర్ శంకర్ నారాయణ అతడిని అభినందించారు. కంబోడియాలో జరిగే ఆసియా పారా త్రోబాల్ టోర్నమెంట్లో భారత జట్టు తరపున ఆడనున్నారు.
News March 16, 2025
అనంతపురం: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఈ నెల 17వ తేదీన సోమవారం అనంతపురం కలెక్టరేట్లో PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని సూచించారు.