News September 5, 2024

అనంతపురం ఆతిథ్యం బాగుంది: రుతురాజ్‌, అయ్యర్‌

image

అనంతపురంలో సదుపాయాలు బాగున్నాయని కెప్టెన్లు రుతురాజ్‌, అయ్యర్‌ కొనియాడారు. ‘దేశంలోని అత్యుత్తమ గ్రౌండ్లలో అనంతపురం ఒకటి. అనంతపురం ఆతిథ్యం బాగుంది. పోటీలు ఇక్కడ నిర్వహించడం వల్ల ఇక్కడి క్రికెటర్లకు ఎదగాలన్న ఆసక్తి రేకెత్తుతుంది’ అని తెలిపారు. ఈ క్రమంలో విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు.. ఇక్కడికి వచ్చింది పోటీల్లో ప్రతిభను నిరూపించుకోవడానికే గానీ రుచికరమైన వంటలు తినడానికి కాదని చమత్కరించారు.

Similar News

News November 6, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి అమ్మాయిలు

image

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలలో తాడిపత్రి అమ్మాయిలు సత్తా చాటారు. SGFI ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో అండర్-17 విభాగంలో అర్షియ, అవనిక, చాందిని.. అండర్-14 విభాగంలో ఆయేషా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు కబడ్డీ కోచ్ లక్ష్మీ నరసింహ తెలిపారు.

News November 5, 2025

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి, విస్తరించాలని కలెక్టర్ ఆనంద్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న గ్రామపంచాయతీ స్థాయి వరకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందని అన్నారు.

News November 4, 2025

పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 105 పిటిషన్లు: ఎస్పీ

image

అనంతపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 105 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పిర్యాదు దారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.