News March 29, 2024

అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ

image

అనంతపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణను టీడీపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. ఈయనకు బోయ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడిగా గుర్తింపు ఉంది. 2009 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హిందూపురం నుంచి పోటీ చేసి ఓడిపోయ్యారు. హిందూపురం పార్లమెంట్ స్థానం ఆశించారు, కానీ టీడీపీ అధిష్ఠానం అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించింది.

Similar News

News January 20, 2025

మైనస్ 8 డిగ్రీల చలిలో తాడిపత్రి చిన్నారుల నృత్యం

image

తాడిపత్రికి చెందిన చిన్నారులు జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి టెంపుల్, హిడింబ వద్ద మైనస్ 8 డిగ్రీల చలిలో కూచిపూడి నృత్యం చేసి అందరిని అబ్బురపరిచారు. దాదాపు 22 కిలోమీటర్లు కాలినడకన చేరుకుని నృత్య ప్రదర్శన చేసినట్లు శిక్షకులు వందన, ప్రవీణ్ లు తెలిపారు. ఈ చిన్నారులు ఇప్పటికే వరల్డ్ రికార్డ్ బుక్‌లో చోటు సంపాదించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేత అభినందనలు అందుకున్నారు.

News January 20, 2025

ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడిపై పోక్సో కేసు

image

అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. సీఐ మహానంది వివరాల మేరకు.. పట్టణానికి చెందిన చిరంజీవి అనే యువకుడు ప్రేమ పేరుతో ఓ బాలికను వేధిస్తున్నాడు. హెచ్చరించినా అతడి తీరు మారలేదు. తరచూ వేధింపులకు గురిచేస్తుండటంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

News January 20, 2025

వయోపరిమితిపై సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు: ఎస్పీ

image

పోలీస్ దేహదారుఢ్య పరీక్ష అభ్యర్థులకు వయోపరిమితిపై జీవో 155 ద్వారా నివృత్తి చేసుకోవచ్చని అనంతపురం ఎస్పీ జగదీశ్ కోరారు. వయో పరిమితి ఉన్నా అనుమతించడం లేదంటూ మీడియాలో ప్రచురితమైన వార్తలో నిజం లేదన్నారు. 2022 నవంబర్ 28న ఏపీ పోలీస్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ విడుదల చేసిన నోటిఫికేషన్ క్షుణ్ణంగా గమనించాలన్నారు.