News January 29, 2025

అనంతపురం: ఎన్టీఆర్ భరోసాపై వీడియో కాన్ఫరెన్స్

image

అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్‌లో “ఎన్టీఆర్ భరోసా” పథకంపై సమావేశం జరిగింది. సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఫిబ్రవరి 1న పెన్షన్ల పంపిణీకి సంబంధించి డిఆర్డీఏ, పీడీ, మండల ప్రత్యేక అధికారులు, బ్యాంకు నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, ఎపీఎంలతో సమావేశం జరిగింది.

Similar News

News February 19, 2025

22న అనంతపురానికి మందకృష్ణ మాదిగ రాక

image

అనంతపురంలో ఈ నెల 22న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నేత చెరువు నాగరాజు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతారని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నేతలు, అభిమానులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News February 18, 2025

వైఎస్ జగన్ దళిత ద్రోహి: ఎమ్మెల్యే బండారు శ్రావణి

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్ దళిత ద్రోహి అని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి విమర్శించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. దళితులపై దాడి కేసులో విజయవాడ సబ్ జైల్‌లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ‘నా ఎస్సీలు.. నా ఎస్టీలు’ అని చెప్పే నాయకుడు ఎస్సీల పైన దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారని మండిపడ్డారు.

News February 18, 2025

అనంతపురంలో చెట్టుకు ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు ధర్మవరం మండలం మాలకాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!