News April 24, 2024
అనంతపురం: ఎన్నికల మస్కట్‌గా వేరుశనగ

అనంతపురం జిల్లా ఎన్నికల మస్కట్‌గా ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి ప్రశాంత కుమార్ రూపొందించిన ‘వేరుశనగ’ ఆకృతి ఎంపిక చేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదట ఎన్నికల మస్కట్‌ను రూపొందించిన జిల్లాగా అనంతకు ఖ్యాతి దక్కిందని కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. ఎన్నికల మస్కట్ ఎంపిక పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 62 మస్కట్‌లు రాగా న్యాయ నిర్ణేతలు వేరుశనగ మస్కట్‌ను ఎంపిక చేశారు.
Similar News
News January 21, 2026
జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా వడ్డె వెంకట్ బాధ్యతల స్వీకరణ

అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా వడ్డె వెంకట్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తనకు, జిల్లా స్థాయి ఉన్నత పదవి కల్పించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని గ్రంథాలయాలను ఆధునీకరించి, విద్యార్థులకు, పాఠకులకు అందుబాటులో ఉండేలా అభివృద్ధి బాటలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
News January 21, 2026
రైతుల పాలిట కనక వర్షంగా మారిన దానిమ్మ పంట

అనంతపురం జిల్లాలో పండిస్తున్న దానిమ్మ పంట రైతుల పాలిట కనక వర్షం కురిపిస్తోంది. కొంతకాలంగా గిట్టుబాటు ధరలు లేక రైతులు పడిన ఇబ్బందులు అన్నీఇన్ని కావు. నేడు నాణ్యతను బట్టి టన్ను దాదాపు రూ.1.50 లక్షలకు పైగా వ్యాపారులు తోటల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పుట్లూరు మండలం బాలాపురంలో రైతు సుదర్శన్ రెడ్డికి చెందిన తోటలో ఒక్కో దానిమ్మ కాయ 0.830 గ్రాముల బరువు దిగుబడి రావడం విశేషం.
News January 20, 2026
ఇన్‌ఛార్జి కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు

అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ బదిలీ కావడంతో రెవెన్యూ భవనంలో మంగళవారం రాత్రి ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. రెవెన్యూ శాఖ, జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సేవలను పలువురు కొనియాడారు. జిల్లా అభివృద్ధి, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ అభినందనీయమన్నారు. అధికారుల అభినందనల మధ్య ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.


